ETV Bharat / state

జనసేన అభ్యర్థి నామినేషన్​ గల్లంతు.. మున్సిపల్​ కమిషనర్​కి ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఐదవ వార్డులో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి అన్నవరపు శ్రీనివాసులు.. తన నామినేషన్​ గల్లంతైదని కమిషనర్​కి ఫిర్యాదు చేశాడు. పోటీలో ఎవరూ లేకపోవటంతో వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారన్నారు.

municipal commissioner
మున్సిపల్​ కమిషనర్
author img

By

Published : Mar 5, 2021, 5:19 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 5వ వార్డు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నవరపు శ్రీనివాసులు.. తన నామినేషన్​ గల్లతైందని కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు. ఆ వార్డులో వైకాపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేశారు. వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక తెదేపా అభ్యర్థి నామినేషన్​ విత్​ డ్రా చేసుకున్నాడు. మూడో తేదీన జరిగిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో తన ప్రమేయం లేకుండానే.. నామినేషన్​ విత్​ డ్రా అయినట్లు ఫిర్యాదులో శ్రీనివాస్​ పేర్కొన్నాడు. దీంతో వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారని వాపోయాడు. బంధువుల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా.. ఇలా జరిగిందని చెప్పారు.

ఇదీ చదవండి: నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.