ETV Bharat / state

జమీలుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

author img

By

Published : May 25, 2021, 5:44 PM IST

నెల్లూరు జిల్లా కావలిలోని విజేత కాలేజీలో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులను 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్​కు పంపుతున్నట్లు డీస్పీ ప్రసాద్ తెలిపారు.

జమీలుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
జమీలుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

నెల్లూరు జిల్లా కావలి పట్టణం కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీలోని విజేత కాలేజీలో మూడు రోజుల క్రితం జరిగిన జమీలుద్దీన్ హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. నిందితులను డిమాండ్​కు పంపనున్నట్లు ఆయన తెలిపారు. సిగరెట్ వెలిగించుకోవడం కోసం అగ్గిపెట్టె అడిగినందుకు నిందితుడు రాహుల్ బీరు సీసాతో జమీలుద్దీన్​పై దాడి చేశాడని.. అడ్డుకోబోయిన పృధ్వీకి స్వల్ప గాయాలైనట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కావలి 2వ పట్టణ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి..

బీరు సీసాలతో కొట్టి చంపేశారు..!

కొడవలితో దాడి... మహిళ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.