ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సీఎం జగన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్లో విద్యార్థులకు కిట్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పుర కమిషనర్ నరేంద్రకుమార్, ఎంపీడీవో నర్మద, ఎంఈవో మస్తానయ్య, వైకాపా నేతలు కళత్తూరు శేఖర్ రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, జెట్టి వేణు, దబ్బల శ్రీమంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి :