నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అధికారులు, నోడల్ అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జీజీహెచ్, పూర్తి స్థాయిలో కొవిడ్ వైద్యశాలగా మార్చిన నారాయణ వైద్యశాల, జిల్లాలోని మొత్తం 21కరోనా ఆసుపత్రుల పనితీరును మంత్రి సమీక్షించారు. కొవిడ్ రోగులకు అందుతున్న చికిత్స, టెస్టింగ్‌పై వైద్యులు, నర్సులతో మాట్లాడారు.
ఆసుపత్రుల్లో చేరిన వారికి మంచి భోజనం అందించాలని మంత్రి కోరారు. మృతదేహాన్ని 24గంటల్లో బంధువులకు అప్పగించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పేషెంట్‌ను బంధువులాగా భావించాలని అన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జేసి హరింధ్రప్రసాద్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు సీఎం జగన్ ఫోన్