One stabbed in Nellore: ఇరు వర్గాల వాగ్వాదం ఒకరిపై కత్తిపోట్లకు దారి తీసింది. నెల్లూరులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో స్థానిక బారాషహీద్ ప్రాంతం ఉలిక్కిపడింది. నెల్లూరు బారాషాహిద్ దర్గా వద్ద ముస్లిం నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం ఘర్షణ చోటుచేసుకుంది. ఒక్కరికి కత్తిపోట్లు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరుడు సమీర్ కాగా, రాజకీయ అంశాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య వాగ్వాదం అందుకు కారణమని తెలిసింది. ఘర్షణ నేపథ్యంలో బారాషాహీద్ దర్గా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నివారించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అస్పత్రిలో పరామర్శించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ... రాజకీయ అంశాలపై చెలరేగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారితీసింది. వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నేత సమీర్ ఖాన్ కత్తిపోట్లకు గురవడంతో.. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రయివేటు హాస్పిటల్ కు తరలించారు. దీంతో బారాషాహీద్ దర్గా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల కోటమిట్టకు చెందిన ముస్లిం మైనార్టీ నేత షమికి, సమీర్ ఖాన్ కు మధ్య చోటుచేసుకున్న రాజకీయ వివాదమే ఈ ఘటనకు దారితీసింది. కత్తిపోట్ల గురైన సమీర్ ఖాన్ ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పరోక్షంగా షమీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్... పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమీర్ అనే యువకుడు పది సంవత్సరాలుగా వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. నెల్లూరుకు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారిన వ్యక్తి... మతం ముసుగులో, నేనొక్కడినే ముస్లింలను ఉద్ధరిస్తా అనే అబద్దాలతో.. దిగజారిన వ్యక్తి సమీర్ పై దాడికి పాల్పడ్డాడు. తన నీచమైన క్యారెక్టర్ తో చిల్లర రాజకీయం చేస్తున్నారు. మేంగానీ, మా నాయకులు కూడా అతడి విషయంలో వద్దని వారించాం. అతడిని ఎవరు ప్రోత్సహిస్తున్నరనేది అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమీర్ కు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన ఆస్పత్రికి తరలించాం. ముస్లింలకు మచ్చ తీసుకొచ్చే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఈ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. - అనిల్ కుమార్ యాదవ్, నగర ఎమ్మెల్యే, నెల్లూరు
ఇవీ చదవండి :