నెల్లూరు జిల్లా కావలి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనపరచుకున్నారు. మండల పరిధిలోని చెన్నయిపాలెం, నందమ్మపురం, గ్రామ శివారులో అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు... ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో కావలి గ్రామీణ ఎస్సై మాల్యాద్రి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రెండు లారీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్ - SEIZE
కావలి మండల పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలుంటాయని డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా కావలి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనపరచుకున్నారు. మండల పరిధిలోని చెన్నయిపాలెం, నందమ్మపురం, గ్రామ శివారులో అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు... ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో కావలి గ్రామీణ ఎస్సై మాల్యాద్రి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రెండు లారీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Body:noble
Conclusion:akivudu