నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అంబేడ్కర్ నగర్ బైపాస్ రోడ్డులో సుమలత, జాన్ అలెక్స్ దంపతులు బాడుగ ఇంట్లో నివాసముంటున్నారు. జాన్ అలెక్స్ నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని... భార్య సుమలత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అలెక్స్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన అలెక్స్... ఇంట్లో ఉన్న సామాగ్రికి నిప్పంటించాడు. భార్యా పిల్లలు గమనించి, స్థానికులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీచదవండి.