ETV Bharat / state

తేనెటీగల దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం - తేనెటీగల దాడిలో గాయాలు తాజా వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కూరగాయల మార్కెట్ యార్డ్​లో తేనెటీగల గుంపు దాడి చేశాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

honey bees attack on vegetable market
కూరగాయల మార్కెట్​లో తేనెటీగల దాడి
author img

By

Published : May 20, 2020, 12:52 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కూరగాయల మార్కెట్ యార్డ్​లో తేనెటీగల గుంపు.. అక్కడున్న వారిపై ఎగబడింది. తెల్లవారుజాము కూరగాయలు కొనేందుకు ఎక్కువ మంది మార్కెట్​కు వస్తారు. అదే సమయంలో జరగిన ఈ ఘటనలో.. దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పురపాలక శాఖ అధికారులు ట్రాక్టర్లతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచకారీ చేయించారు.

అయినప్పటికీ తేనెటీగల గుంపు అదుపు కాలేదు. సోడియం హైపోక్లోరైడ్​ పిచికారీ చేసే సిబ్బంది పైనా దాడి చేశాయి. వస్త్రాలకు మంటలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. అంతే కాక... న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ముగ్గురు మీడియా ప్రతినిధులను సైతం తేనెటీగలు కుట్టాయి. ఈ ఘటనలో గాయపడినవారిలో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవీ చూడండి:

వేతనాలు లేక ఇబ్బందుల్లో నెల్లూరు జీజీహెచ్‌ భద్రతా సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.