నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేశారంటూ పోలింగ్ కేంద్రాన్ని గ్రామస్థులు చుట్టుముట్టారు. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. బ్యాలెట్ పెట్టెలు తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్రామంలో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది.
ఇదీచదవండి