ETV Bharat / state

Sonusood: సోనూసూద్ దాతృత్వం.. నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్

author img

By

Published : Jul 5, 2021, 5:32 PM IST

కరోనా సమయంలో ఎంతో మందికి చేయూతనందించిన రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆయన.. ఇవాళ జిల్లాకు ప్లాంట్​ను పంపించారు. ఆక్సిజన్ ప్లాంట్​ను జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయనున్నారు.

hero sonusood sent oxygen plant to nellore
సోనూసూద్ దాతృత్వం.. నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్

కరోనా సమయంలో ఎంతో మందికి చేయూతనందించిన రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో చలించిన ఆయన.. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం.. ప్లాంట్​ను నెల్లూరు జిల్లాకు పంపించారు. నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ వద్దకు చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్​కు.. సోనూసూద్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.

సర్వమత ప్రార్ధనలు నిర్వహించి, బాణాసంచా కాల్చి ఆయనకు అభినందనలు తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తన దాతృత్వంతో.. నిజమైన హీరోగా సోనూసూద్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని ఆయన అభిమానులు కొనియాడారు.

ఇదీ చదవండి:

Sonu Sood: ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు..​ తెలుగులో ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.