నెల్లూరు జిల్లా పొట్టేపాళెంలో నివాసముంటున్న మణి అనే వ్యక్తి దయనీయ స్థితిపై ఈనాడు ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. చాట్ల శ్రీనివాసులు, రేణుకా దంపతులు స్పందించి తన కుమారుడి అశ్రిత్ పుట్టినరోజున.. ఆ కుటుంబానికి రెండు నెలల నిత్యావసర సరకులు, నూతన వస్త్రాలు, నగదు అందజేశారు. వీరితో పాటు రహంబర్ ఫౌండేషన్ సభ్యులు రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ షేక్ రసూల్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి తోపుడు బండి, సరకులు అందించారు.
మణి రెండేళ్ల క్రితం చెట్టు మీద నుంచి పడి వెన్నుపూస దెబ్బతింది. అప్పటినుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు. అతనిపై ఆధారపడిన భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛను ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఆలమట్టికి పెరిగిన వరద.. అయిదారు రోజుల్లో దిగువకు నీరు