నెల్లూరు నగరంలోని హోటల్స్, ఐస్‌క్రీమ్, టీ దుకాణాల్లో కార్పొరేషన్, ఆహార కల్తీ నియంత్రణ అధికారుల ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని తందూరి చికెన్ షాప్‌లో దాదాపు 30 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. ఈ మాంసంలో ఫంగస్ చేరి పాడైందని పేర్కొన్నారు. సింహపురి రుచుల హోటల్లోనూ ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణంతో బొద్దింకలు, ఎలుకలు ఉండటాన్ని గుర్తించారు. దాదాపు 10 హోటల్స్‌లో దాడులు జరిపిన అధికారులు... 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. పలు హోటల్స్‌కు నోటీసులు జారీ చేసి, తాత్కాలికంగా సీజ్ చేశారు. పరిస్థితి మెరుగుపడకుంటే శాశ్వతంగా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కాలుష్య నగరాల్లో నెల్లూరుకు ఐదో స్థానం