ETV Bharat / state

macaw illegal transport: గ్రీన్ వింగ్ మకావ్ జాతి పక్షుల పట్టివేత - బీవీ పాళెంలో గ్రీన్ వింగ్ మకావ్ జాతి పక్షుల పట్టివేత

నెల్లూరు జిల్లాలోని బీవీ పాళెం వద్ద.. అక్రమంగా తరలిస్తున్న గ్రీన్ వింగ్ మకావ్ జాతికి చెందిన రామచిలుకలను అధికారులు గుర్తించారు. వాహన తనిఖీల్లో భాగంగా కారు డిక్కీలో ఉన్న పంజరాల్లో పక్షులను గమనించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించారు.

green wing makav species birds are seized at bv palem in nellore
గ్రీన్ వింగ్ మకావ్ జాతి పక్షుల పట్టివేత
author img

By

Published : Sep 5, 2021, 10:11 AM IST

Updated : Sep 5, 2021, 10:49 AM IST

నెల్లూరు జిల్లాలోని తడ మండలం భీమునివారిపాళెం చెక్​పోస్టు వద్ద శనివారం ఉదయం విదేశీ రామచిలుకలు పట్టుబడ్డాయి. విజయవాడ నుంచి చెన్నైలోని కాంచీపురానికి.. ఎలాంటి అనుమతులు లేకుండా కారులో తరలిస్తున్న.. గ్రీన్ వింగ్ మకావ్ జాతికి చెందిన ఎనిమిది రామచిలుకలను సెబ్ అధికారులు గుర్తించారు. వాహన తనిఖీల్లో భాగంగా కారు డిక్కీలో ఉన్న పంజరాల్లో పక్షులను గమనించారు. సురేంద్ర అనే వ్యక్తి కారులో కాంచీపురానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ప్రసాద్ తెలిపారు. వాటిని సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఈ పక్షుల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

TEACHERS DAY: కరోనా వల్ల గురుపూజోత్సవాలు రద్దు.. ఆదేశాలు జారీ

Last Updated : Sep 5, 2021, 10:49 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.