ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలకు హౌస్​​ఫుల్ బోర్డు!

సీట్లు లేవు... తల్లిదండ్రులు సహకరించగలరు...అనే బోర్డు దర్శనమిస్తోంది ఆ పాఠశాలకు వెళితే.. అలా అని అదేదో... కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరబడినట్లే.. అక్షరాలా అది ప్రభుత్వం పాఠశాలే! ఒకటి రెండు కాదు.. నాలుగేళ్లుగా ఈ బోర్డు దర్శనమిస్తోందక్కడ.

సీట్లు లేవు... తల్లిదండ్రులు సహకరించగలరు!
author img

By

Published : May 5, 2019, 7:03 AM IST

Updated : May 5, 2019, 12:16 PM IST

సీట్లు లేవు... తల్లిదండ్రులు సహకరించగలరు!

మీ పిల్లలని ఎక్కడ చేరుస్తున్నారని ఎవరినైనా అడిగితే ఏదో ఒక కార్పొరేట్ పాఠశాల పేరు ఠక్కున చెబుతారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తామని ఎవరూ చెప్పరు. నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్​లో ఉన్న కేఎన్ఆర్ పురపాలక పాఠశాల మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ పాఠశాలలో పిల్లలను చేర్చడానికి తల్లితండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలు ప్రారంభానికి 44 రోజులే ఉంది. ఇప్పటి నుంచే సీటు కావాలంటూ తల్లిదండ్రులు తంటాలు పడుతున్నారు.

జిల్లాలోనే ప్రథమ స్థానం..

విద్యార్ధుల సంఖ్య అపరిమితంగా ఉన్న కారణంగా ఈ విద్యా సంవత్సరానికి కేఎన్​ఆర్ పురపాలక పాఠశాలలో 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశం లేదు. సీట్లు లేవు. ఆరోతరగతికి మాత్రమే సీట్లు ఉన్నాయనే బోర్డు కేవీఆర్ ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద పెట్టారు. ఇంతలా కేఎన్​ఆర్ పాఠశాల వృద్ధిలోకి రావడానికి.. ఇక్కడ 15 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్న ప్రకాశ్ రావు కృషే కారణం. ప్రతి ఏటా కార్పొరేట్ బడులకు దీటుగా ఫలితాలు తెప్పిస్తున్నారు. 2010లో సుధీర్ అనే విద్యార్థి 582 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వచ్చింది. ఏటా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

ఉపాధ్యాయుల పిల్లలు సైతం!

ఆరోతరగతిలో చేరే విద్యార్థులకు ఇప్పటి నుంచే స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చేవారికి, పేద విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అవకాశాలు. ఈ ప్రభుత్వ పాఠశాల ధాటికి తట్టుకోలేక సమీపంలో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. విద్యతోపాటు, క్రీడలు, క్రమశిక్షణ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో పనిచేసే ఆరుగురు ఉపాధ్యాయులు వారి పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు.

287 నుంచి 1400!

1992లో 287మంది విద్యార్ధులు ఉన్న పాఠశాల నేడు 1400మంది విద్యార్థులతో కిటకిటలాడుతోంది. సీటు కావాలని ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ప్రతి విద్యా సంవత్సరంలో వస్తున్నయంటే ఇక్కడ డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. సీట్లు లేవని వేసవి సెలవుల్లోనే బోర్డు పెట్టడం.. ఈ పాఠశాలకున్న ఆదరణను చెప్పకనే చెబుతోంది.

New Delhi, May 04 (ANI): The Bharatiya Janata Party (BJP) on Saturday went one step ahead of Prime Minister Narendra Modi to mock the Congress party over its claim of 'six surgical strikes' taking place during the UPA era, and said the grand old party conducted the military actions from its Delhi office on mobile apps. PM Modi on Friday had criticised the Congress for claiming that six surgical strikes took place in UPA era, and jabbed that the party did the surgical strikes in video games.
Last Updated : May 5, 2019, 12:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.