రైతులు నష్టపోకుండా అన్ని గ్రేడ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి సమీక్షించారు.
ప్రతి మండలానికి అధికారులను నియమించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతుల సమస్యల పట్ల అధికారులు అశ్రద్ధ వహిస్తే చర్యలు తీసుకుంటాం. సోమశిలకు కృష్ణా వరద జలాలు తరలిస్తున్నాం. అక్కడినుంచి కండలేరు జలాశయానికి నీటిని విడుదల చేస్తాం. సోమశిల జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపి... సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తాం- అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి
సమీక్షలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కలివేటి సంజీవయ్యలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
ఆ అధికారులపై నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకోవాలి: సీఎం