SOMASILA: రెండు సంవత్సరాల క్రితం వర్షాలకు దెబ్బతిన్న సోమశిల జలాశయ అప్రాన్కు ప్రభుత్వం ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టింది. 99 కోట్ల రూపాయలు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడగారు పంటకు నీరు విడుదల చేశామని సోమశిల జలాశయం ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో నీరు ఇస్తూనే పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి :