నెల్లూరు జిల్లాలోని ఏపీఎంఐపీ అధికారులు, డ్రిప్ కంపెనీల ఉద్యోగులతో ఉద్యానశాఖ ఓఎస్డీ రమేశ్ సమావేశం నిర్వహించారు. బిందు, తుంపర్ల సేద్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో రైతులకు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్న పరికరాలు వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు.
2020 - 21 సంవత్సరానికి రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన అన్నారు. డ్రిప్ కంపెనీలు, రైతులకు రావాల్సిన రాయితీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందన్నారు.
ఇదీ చదవండి: