పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తూర్పుకనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ జాతరను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పు వైపు మిట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుడిసెలో అమ్మవారిని మట్టితో విగ్రహం చేసి సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కరోనా ప్రభావంతో ఆలయంలో భక్తులు లేక ఖాళీగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులను సైతం పోలీసులు వెనక్కి పంపించారు. దూరప్రాంత భక్తులెవరూ జాతరకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :