నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో ఉరేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోకల అనూష అనే యువతి అగ్రికల్చర్ డిప్లొమో చేసి రెండేళ్లుగా ఇంటి వద్ద ఖాళీగా ఉంటోంది. కొన్ని నెలలపాటు ఉదయగిరిలోని ఓ ఫ్యాన్సీ షాప్లో పనిచేసి మానేసింది. ఆమె తల్లి నాగవేణి స్థానికి అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. శుక్రవారం తల్లి విధులకు వెళ్లగా.. తండ్రి పనికి వెళ్లాడు. ఆ సమయంలో బాత్రూంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగవేణి కుమార్తె కనిపించడంలేదని ఇల్లంతా వెతగ్గా.. బాత్రూంలో ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..