నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పమిడిపాడు వద్ద గత 12 సంవత్సరాల నుండి 31 గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుడిసెల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. మెుదటి ప్రాముఖ్యతగా అదే స్థలంలో.. ఖాళీ చేసిన గిరిజనులందరికీ పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు నమ్మబలికారు. లేఔట్లు వేసి 723 మంది లబ్దిదారులకు వాటిని కేటాయించారు కానీ.. ఇప్పుడు అక్కడ గిరిజనులకు ఇస్తామన్న స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.
గిరిజన కుటుంబాలను ఖాళీ చేయించిన స్థలాలను సంపన్నులకు కేటాయించారని వారు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ అందుబాటులో లేక పోవడంతో గిరిజన వృద్ధులకు పింఛన్లు, ఇతర ప్రభుత్వం పథకాలు అందడం లేదంటున్నారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్ లేక ఇబ్బందిపడుతున్నామని వాపోయారు. నివసిస్తున్న స్థలం నుంచి పోరంబోకు స్థలాలకు తమ నివాసాలకు తరలించడం వల్ల రాత్రయితే పాముల బెడదతో భయం గుప్పిట్లో జీవిస్తున్నామని.. అధికారులు వెంటనే స్పందించి తమను ఖాళీ చేయించిన చోటే ఇళ్ల స్థలాలు కేటాయించి స్యాయం చేయాలని గిరిజన కుటుంబాలు కోరుతున్నాయి.
ఇదీ చదవండి: మూడేళ్ల పాప లాకప్ డెత్‌పై నిరసన జ్వాల
ఇదీ చదవండి: ఇంటి పట్టా కోసం జాతీయ రహదారిని దిగ్బంధించిన మందుబాబు