నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణ పనులకు ప్రభుత్వం రూ.11 కోట్ల 34 లక్షలు కేటాయించిందని నీటిపారుదల శాఖ సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ తెలిపారు. ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట పరిస్థితి బాగా లేకపోవటంతో ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారని చెప్పారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు.
రబీ పంట పూర్తయిన వెంటనే ఫిబ్రవరి, మార్చిలో పనులు మొదలు పెడతామని ఈఈ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నిధులతో అన్ని పనులు సంపూర్ణంగా చేస్తామన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్‌కు నిధులు విడుదల కావటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కృషితో నిధులు విడుదలయ్యాయని వివరించారు.
ఇది చదవండి రబీ విత్తనాలు సకాలంలో అందించేందుకు అధికారుల చర్యలు