నెల్లూరులోని గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్.. లాక్డౌన్ కాలంలో తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నగరంలోని బోడిగాడితోట స్మశానవాటిక దగ్గర నివాసముండే 500 మంది నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం అందజేశారు. పోషకాహారం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుందన్న ఉద్దేశ్యంతో ఈ సహాయం చేస్తున్నట్టు చెప్పారు.
లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచీ పిల్లలకు ఆహారాన్ని ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను జూన్ నెలాఖరు వరకు పొడిగించినందున ...దాతల సహకారంతో తమ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ తెలిపారు.
ఇదీ చదవండి: