నెల్లూరు జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై కరపత్రాలు విడుదల చేశారు. ఎప్పుడూ జరగని రీతిలో ఇప్పుడు దాడులు జరగడం అన్యాయం అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అన్ని జిల్లాలలో దాడులు జరుగుతున్నాయని తెదేపా నాయకులు మండిపడ్డారు.
ఇదీ చూడండి. కరోనా ఎఫెక్ట్: కొనేవారు లేక మొక్కజొన్న రైతుల అవస్థలు