ETV Bharat / state

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందడుగు - జైకిసాన్​ వార్తలు

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్​లపై రైతులకు, వ్యాపారులకు ఎన్జీవోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతో అవసరమని.. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆత్మ నిర్భరభారత్ అభియాన్ పథకం ద్వారా నిధులు విడుదల చేశాయి. ప్రధానంగా రైతులకు ఉపాధి కల్పించడమే లక్యంగా ఈ పథకం ప్రారంభించారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లపై ఈటీవీ భారత్​ అందిస్తున్న ప్రత్యేక కథనం.

food-processing-unit-implementation-awareness-programme-under-the-atmanirbhar-bharat-in-nellore
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందడుగు
author img

By

Published : Jan 25, 2021, 10:55 PM IST

ప్రధానమంత్రి ఆత్మ నిర్భరభారత్ అభియాన్ పథకం ద్వారా పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎన్జీవో సంస్థల సహకారం తీసుకుంటోంది. ఈ సంస్థల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 2025 సంవత్సరం నాటికి 10,035 ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కేంద్రప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని ఆల్ ఇండియా అమేజ్ ఆప్ కామర్స్ ఛైర్మన్ దేవరాజు తెలిపారు.

ప్రధానమంత్రి ఆత్మ నిర్భరభారత్ అభియాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.460 కోట్ల నిధులు విడుదల చేశాయి. నెల్లూరు జిల్లాలో నిమ్మ, మామిడి, బత్తాయి, రొయ్యలు, చేపలపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక యూనిట్ విలువ రూ.10లక్షల రూపాయలు కాగా... అందులో రైతు వాటా 10 శాతం, ప్రభుత్వం రాయితీ 35 శాతం గా ఉంటుంది. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.