మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్లకు వెళ్లిన మంత్రిని బాధితులు గట్టిగా ప్రశ్నించారు. చస్తామో, బతుకుతామో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపితే.. పరామర్శ పేరుతో ఇప్పుడు వస్తారాఅంటూ నిలదీశారు. నడుముల్లోతు వరద ముంచెత్తడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని, తిండికీ లేక అల్లాడిపోయామని వాపోయారు. వారిని ఓదార్చిన మంత్రి గౌతంరెడ్డి.. ప్రభుత్వం తరఫున వీలైనంత సాయం చేశామని చెప్పారు. కష్టనష్టాలు తెలుసుకుని మరింత అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: