నెల్లూరు జిల్లాలో మార్క్ ఫెడ్ వద్ద ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్ ఫెడ్ ఎరువుల ఉత్పాదక జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎరువులు కావలసిన రైతులు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటి వద్దకే ఎరువులు అందజేస్తామన్నారు. ఎమ్ఆర్పీ ధరలకే నాణ్యమైన ఎరువులను రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి:
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరులో నిరసనలు