కుమారుడి ఆగడాలు భరించలేని తండ్రి.. కన్నబిడ్డనే హత్య చేశాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రౌడిషీటరైన కొడుకు అశోక్.. నిత్యం మద్యం సేవించి తల్లిదండ్రులను వేధించేవాడు. రోజులాగే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అశోక్.. తల్లిదండ్రులతో గొడవకు దిగి.. తండ్రి పెంచలయ్యపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన తండ్రి.. పక్కనే ఉన్న రోకలిబండతో కుమారుడి తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఇందుకూరుపేట పోలీసులు.. అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
HC: ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ