అకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకి తోడు మంచు కూడా ఎక్కువగా కురుస్తుండంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో తెలవారుజామున మంచు దుప్పటిలా పరచుకుంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మంచు కురుస్తుండటంతో పంటలకు చీడపీడల సమస్య ఏర్పడుతోందని అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. రోడ్డు పై వచ్చే వాహనదారులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: బిడ్డల భవిష్యత్ కోసం.. వ్యవసాయాన్నే నమ్ముకున్న మహిళా రైతులు