తెదేపా మద్దతుదారులను వెంటాడి వేధిస్తారా..? అని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు అధికారుల పనితీరుకు పరాకాష్ట నెల్లూరు జిల్లా చెర్లోపల్లి ఘటన అని మండిపడ్డారు. బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేసి దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులు తేవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చెర్లోపల్లే కాదు.. నిడిగుంటపాళెం, గుడ్లూరువారిపాళెం, ముదిగేడు తదితర అన్ని ప్రాంతాల్లోనూ దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేయడం అన్యాయమన్నారు. దళిత, గిరిజన, బడుగుబలహీన వర్గాల ప్రజల జోలికి వెళ్లొద్దని మరోసారి అధికారులను కోరారు. వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే సహించేది లేదని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: రాజధాని మార్పు గురించి ఆలోచించే పరిస్థితి లేదు: పెద్దిరెడ్డి