సంక్రాంతి పండుగకు ప్రతిఇంటా ఘుమఘుమలాడాల్సిన పిండివంటలపై.. నిత్యావసరాల ధరలు ప్రభావం చూపాయి. కరోనా దెబ్బకు చితికిన మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ కూలీలు ఈసారి అరకొర వంటకాలతో సరిపెట్టుకున్నారు. పండగ సరుకులకు....... బాగా పెరిగిన ధరలు దెబ్బేశాయి. సంక్రాంతికి నూనెలు వినియోగం ఎక్కువగా ఉంటుంది. అరిసెలు, లడ్డూలు,చక్రాలు, కజ్జికాయలు వంటి సంప్రదాయ పిండివంటలు ఎక్కువగా చేస్తుంటారు. వంటనూనెలతోపాటు ఇతర సరుకుల ధరలు బాగా పెరగడం.. పండుగ సంతోషానికి కాస్త అవరోధంగా మారింది.
కొవిడ్ కు ముందు కంటే ప్రస్తుతం కందిపప్పు, మినపప్పు ధరలు కేజికి 30రూపాయలు పెరిగాయి. సన్ ప్లవర్ ఆయిల్ కేజి 95నుంచి 135 రూపాయలకు పెరిగింది. పామాయిల్ కూడా మండిపోతోంది. ఫలితంగా ప్రజల కొనుగోళ్లు తగ్గి వ్యాపారాలూ ఆశించినంత జరగలేదని దుకాణదారులు చెప్తున్నారు.
గతంలో ప్రభుత్వం పండుగ సందర్భాల్లో ఇచ్చే కానుకలు కాస్త చేదోడుగా ఉండేవని ఇప్పుడు ధరలు భారంగా మారాయని.. కొనుగోలుదారులు పెదవివిరుస్తున్నారు.
ఇవీ చదవండి