ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన 211 మంది మత్స్యకారులు 5 బస్సుల్లో తమ సొంత జిల్లా నెల్లూరుకు చేరుకున్నారు. వారందరినీ 14 రోజులపాటు గూడూరు లోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల క్వారంటైన్‌లో ఉంచారు. అన్ని వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ల సహకారంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాళ్లలో ఎవరికీ వైరస్ సోకలేదని.. కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని గూడూరు డివిజన్ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. క్వారెంటైన్ గడువు ముగియగానే వారిని స్వగ్రామాలకు తరలిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: