ఉగాది సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని రోడ్లపై భారీగా జనాలు సంచరిస్తున్నారు. మాంసం, నిత్యావసర సరుకుల దుకాణాల ముందు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చారు. పోలేరమ్మ గుడి వీధిలో, విశ్వోదయ కళాశాల మైదానంలో కూరగాయలు, చేపలు మాంసం విక్రయాలు భారీగా చేపట్టారు. బారికేడ్లను పట్టించుకోకుండా విక్రయాలు జరుగుతున్నాయి. లాక్డౌన్ను పురపాలకశాఖ ఆచరణలోకి తీసుకు రాలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: