నెల్లూరు జిల్లా మహిమలూరు, రామస్వామిపల్లి, బసవరాజు పాలెం గ్రామాల్లో డీఆర్డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి సహకారంతో.. మాస్కులు పంపిణీ చేశారు. మహిమలూరు ఆయన సొంత గ్రామం. అక్కడ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా.. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కుడుముల సుధాకర్, డీఎస్పీ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: