![ఉదయగిరిలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థన్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8232381_112_8232381_1596109097992.png)
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల విద్యావనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ ఆచార్యులుతో కలిసి సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామపురం మండలం ఓగూరు వాండ్లపల్లి, అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో జరిగే నాడు-నేడు పనులను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి పనులు చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. ఆగస్టు 31లోపు పాఠశాలలో మొదటి దశ నాడు-నేడు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో 1066 పాఠశాలలో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వచ్చే నెలాఖరులోపు అన్ని పాఠశాలలో నాడు-నేడు పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి