ETV Bharat / state

'కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు'

మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు కూరగాయలను అందుబాటు ధరలలో ఉంచి విక్రయించాలని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ చైర్మన్ ఏసు నాయుడు తెలిపారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి షాపు నందు కూరగాయల ధరల వివరాల బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలన్నారు.

nellore agriculture market union meeting latest
నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశం
author img

By

Published : Oct 5, 2020, 6:01 PM IST

వినియోగదారులకు విక్రయించే కూరగాయల తూకాలు కచ్చితంగా ఉండేటట్టు చూడాలని... నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసు నాయుడు సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ఆవరణంలో మార్కెట్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.

మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు కూరగాయల ధరలను అందుబాటులో ఉంచి విక్రయించాలని తెలిపారు. అలాకాకుండా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి షాపు నందు కూరగాయల ధరల వివరాల బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలన్నారు.

అందరూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి షాపు వారు చెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొవాలని... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏసీ మార్కెట్ లోని ప్రతి దుకాణం యజమాని చెల్లించవలసిన అద్దె బకాయిలను క్రమం తప్పకుండా నిర్ణీతకాలవ్యవధిలోనే చెల్లించాలన్నారు.

ఇదీ చదవండి:

అన్​లాక్-5 నిబంధనలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.