Diarrhea spreading: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని ఎర్రబల్లి గ్రామంలో అతిసార ప్రబలింది. గిరిజన కాలనీకి చెందిన ఇండ్ల వెంకటరమణమ్మ అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందింది.
గత పది రోజులుగా గ్రామంలో నీరు కలుషితమై పలువురు అస్వస్దకు గురవుతుంటే.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కానీ.. పంచాయతీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
గిరిజన, ఎస్సీ కాలనీలలో అతిసారం ఉందని గ్రామస్తులు తెబుతున్నా.. ఏ ఒక్క అధికారి కూా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీళ్లన్నీ కాలనీకి చేరడం వల్ల పరిస్దితి అధ్వానంగా ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామ సర్పంచ్ , పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి తీవ్రంగా తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెజర్ల మండలం మడపల్లి గ్రామంలో సుమారు 200 మంది జ్వరంతో బాధపడుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చెసిన వైద్య శిబిరంలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: Gas Leakage: రిమ్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ లీక్..అప్రమత్తమైన సిబ్బంది