Diarrhea deaths in Nellore district : నెల్లూరు జిల్లాలో అతిసారం భయంతో ప్రజలు భయపడుతున్నారు. పదుల సంఖ్యలో వాంతులు విరేచనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్లలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి కొందరు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రతి గ్రామంలో పదిమందికి తక్కువ కాకుండా అతిసారంతో బాధపడుతున్నారు. జిల్లా కేంద్రం నెల్లూరు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. కలుషిత నీటిసరఫరా, పారిశుద్ధ్యం లోపం వంటి సమస్యలతోనే వాంతులు విరేచనాలు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
People fear with Diarrhea : జిల్లాలోని శివారు ప్రాంతాల్లో, బుచ్చిరెడ్డి మండలంలో పాలెంలో ఆరుగురు మృతి చెందారు. ఆసుపత్రుల్లో పదులు సంఖ్యల అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అతిసారం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఆసుపత్రిలో కాలనీవాసులు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అందరికీ వాంతులు విరేచనాలు కావడంతో ఆసుపత్రికి వస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
Diarrhea cases increasing in Nellore district : నెల్లూరు కుసుమ హరిజన వాడలో ఇద్దరు మృతి చెందారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇసుకపాళెం పల్లాప్రోలులో గ్రామంలో మరో నలుగురు మృతి చెందారు. వివిధ రకాల సమస్యలు ఉన్న వారికి వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. గ్రామాల్లో, పురపాలక సంఘాల్లోని శివారు కాలనీల్లో పారిశుద్ద్యం సరిగా లేక.. నీటి కాలుష్యంతో అతిసారం విజృంభిస్తుంది.
Diarrhea deaths : నగర శివారు ప్రాంతాలైన.. కావలి, బుచ్చి, కోవూరు, అల్లూరులో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. కుసుమ హరిజనవాడలో 20మంది బాధితులు ఉన్నారు.అందులో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఇసుక పాలెం పల్లాప్రోలులో 32మందికి డయారేయా సోకిి.. నలుగురు మృతి చెందారు. నెల్లూరు నగరంలోనే వందకుపైగా అతిసార బాధితులు ఉన్నారు. కిసాన్‌నగర్, చింతారెడ్డిపాళెం డొంక ప్రాంతాల్లోనూ దీని తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు నగర శివారుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచటం.. మురుగు కాలువల్లో ఉన్న కొళాయిలు మార్చి.. మంచినీటి ట్యాంకర్లను క్లోరినేషన్ చేయాలని గ్రామాల్లో ప్రజలు కోరుతున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లోనూ..
కుసుమ హరిజనవాడ, బంగ్లాతోట ప్రాంతాల్లో అతిసారం లక్షణాల కేసులు వెలుగు చూడగా.. బుధవారం సీఆర్పీ డొంక ప్రాంతంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అతిసారం లక్షణాలతో ఒకరు ఇంటి వద్ద మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికి చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పారిశుద్ధ్యం లోపించిందన్న ఆరోపణలు ఉండగా దాంతో పాటు తాగునీటి పైప్‌లైన్లలో కలుషితనీరు వస్తోందని ఆయా ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
"కుసుమ హరిజన వాడ ప్రాంతాన్ని పరిశీలించాం. అక్కడ తాగునీటి సరఫరా పైపుల లీకేజీ కారణంగా మురుగునీరు కలుస్తున్నట్లు గుర్తించాం. వెంటనే కార్పొరేషన్ అధికారులకు తెలిపి.. పైపు లీకేజీని అరికట్టాం. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. స్థానికులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించాం. మరికొన్ని రోజులు శిబిరం కొనసాగిస్తాం. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి అతిసారం కేసుల వివరాలు సేకరిస్తాం. నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం." -పెంచలయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి