నెల్లూరులోని పలు డివిజన్ల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా నగరంలోని బస్తీల్లో కలియ తిరిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ అర్హులు వాటిని వినియోగించుకోవాలన్నారు.
వారి వల్లే ఆలస్యం..
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు.
అర్హులందరికీ పంపిణీ..
ఓ పక్క ఇళ్ల స్థలాల ప్రక్రియను అడ్డుకుంటూ, మరోపక్క వారే ఇళ్లు ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి అనిల్ హితవు పలికారు. అర్హులైన వారందరికీ నివాసాలు, స్థలాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్కే దక్కుతుంది: సీఎం జగన్