ఇండియన్ రెడ్ క్రాస్ వందేళ్లను పురస్కరించుకొని నెల్లూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ర్యాలీని నగరంలోని వీఆర్సీ మైదానంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
ఈనెల 21న ఉదయం 6 గంటలకు నెల్లూరు రెడ్ క్రాస్ ఆఫీస్ నుంచి కడప, చిత్తూరు కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన రెడ్ క్రాస్ ప్రతినిధులు సైకిల్ ర్యాలీలో బయలుదేరి 25న విజయవాడకు చేరుకుంటారు. ఈ ర్యాలీలో రక్తదానం, పరిసరాల పరిశుభ్రత, మొక్కల నాటే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ఇదీ చూడండి:
కాసేపట్లో ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం