Arrest: నెల్లూరు జిల్లాలో శ్రీకాంత్ అనే యువకుడిని హిజ్రాగా మార్చేందుకు బీ.ఫార్మసీ విద్యార్థులు శస్త్రచికిత్స చేశారు. అతని మర్మాంగాన్ని తొలగించడంతో.. తీవ్ర రక్తస్రావమై ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు నగర డీఎస్పీ హరినాథ్ తెలిపారు.
శ్రీకాంత్ కు మాయమాటలు చెప్పి అతన్ని పూర్తి స్థాయిలో ట్రాన్సజెండర్ గా మార్చేందుకు.. ముగ్గురు వ్యక్తులు ఆపరేషన్ చేసి మర్మాంగాలు తొలగించారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చిన్న బజార్ పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి.. నిందితులైన మస్తాన్, జీవ, మోనాలిసాను అరెస్టు చేశారు.
అసలేం జరిగింది..?
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28)కు పెళ్లయింది. 6 నెలలకే భార్య విడిచి వెళ్లింది. నాలుగేళ్ల కిందట శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒంగోలులో ఉండేవారు. అక్కడ ఆయనకు విశాఖకు చెందిన మోనాలిసా అలియాస్ అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులయ్యారు.
ఆరు నెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎ.మస్తాన్, జీవ పరిచయమయ్యారు. సాన్నిహిత్యం పెరిగాక తాను ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు శ్రీకాంత్ చెప్పారు. అందుకు రూ.లక్షలు ఖర్చవుతుందని, తాను బీఫార్మసీ విద్యార్థినని, శస్త్రచికిత్సపై అవగాహన ఉందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ హామీ ఇచ్చారు. దీంతో.. ఓ లాడ్జీలో శస్త్రచికిత్స చేపట్టి.. శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. పల్స్ పడిపోవటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
సంబంధిత కథనం: అలా చేస్తామని.. మర్మాంగాన్ని కోసేసి...