ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని స్టౌబిడి కాలనీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ గది అద్దెకు తీసుకుని బెట్టింగ్ పెడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 60వేల రూపాయల నగదు, పది సెల్ ఫోన్లు, ఓ టీవీ, పలు ఏ.టి.యం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: fire accident: నెల్లూరు జిల్లా వడ్డిపాళెంలో అగ్ని ప్రమాదం