నెల్లూరు జీజీహెచ్ కోవిడ్ ఆసుపత్రిలో అమానవీయ సంఘటన జరిగింది. ఇక్కడ వైద్యసేవలు పొందుతున్న ఓ కొవిడ్ పాజిటివ్ వృద్ధుడు మృతిచెందాడు. బాత్ రూముల వద్ద పడి చనిపోయి ఉండటం జిల్లాలో సంచలనంగా మారింది.
పెద్ద వయస్సు కలిగి ఉన్న వ్యక్తి... అందులోనూ షుగర్, బీపీ ఉన్న వ్యక్తి అని కూడా వైద్యులు చెబుతున్నారు. బెడ్ మీద నుంచి బాత్ రూముకు ఎవరూ సహయకులు తీసుకుని వెళ్ళలేదు. కొవిడ్ గదుల్లో వైద్యులు, నర్సులు పర్యవేక్షణ లేదని అనేక సందర్భాల్లో తేలింది. సిబ్బంది నిర్లక్ష్యం ఫలితం ఒకప్రాణం బలిగొన్నారాని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.
సిబ్బంది పర్యవేక్షణ సరిగా లేదని అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. పది రోజుల కిందట భోజనం సమయానికి ఇవ్వడం లేదని. మంచి భోజనం పెట్టటం లేదని, సకాలంలో మందులు ఇవ్వటం లేదని బాధితులు గొడవ చేయటం. వీడియోలు విడుదల చేయడం జరిగింది.
ఈ సంఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి ఏమన్నారంటే...
రోగి వచ్చినప్పటి నుంచి తగిన వైద్యం చేస్తునే ఉన్నామని అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. బాత్ రూమ్ వద్ద కింద పడి ఉన్న వృద్ధుడ్ని చూసి తమ సిబ్బంది త్వరితగతిన స్పందించి సీపీఆర్ చేశారన్నారు. కుటుంబీకులు తమపై దుర్భాషలాడారని, బెదిరించారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి