ETV Bharat / state

విజయవాడ దుర్ఘటనతో అప్రమత్తమైన అధికారులు - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు

ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటిస్తున్నాయా? వాటికి ఎన్‌వోసీలు ఉన్నాయా? వాటిల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? ఏదైనా ప్రమాదం జరిగితే.. దాని తీవ్రతను తగ్గించే అవకాశం ఉందా? ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగాన్ని తొలుస్తున్న ప్రశ్నలివి. విజయవాడలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆ వెంటనే అప్రమత్తమైంది. జిల్లాలో ఎన్ని కొవిడ్‌ కేంద్రాలు, క్వారంటైన్‌ కేంద్రాలు ఉన్నాయో గుర్తించి.. పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం సెలవు సెలవు రోజైనా.. ఇక్కడ అలాంటి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.

covid hospitals
covid hospitals
author img

By

Published : Aug 10, 2020, 12:25 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభన నేపథ్యంలో వైరస్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల సేవలనూ వినియోగించుకుంటున్నారు. అలా నెల్లూరులో 19, కావలి 4, ఆత్మకూరు 3, గూడూరు 2, నాయుడుపేటలో ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయవాడ దుర్ఘటనతో ఇక్కడి పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు. ఆయా జాబితాను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులకు అందజేసి.. ప్రతి ఆసుపత్రికి సంబంధించిన ఎన్‌వోసీ, అగ్నిమాపక పరికరాలపై నివేదిక అందించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. దాంతో అగ్నిమాపకశాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. దాని ఆధారంగా పరిశీలనకు సిద్ధమయ్యారు.

నెల్లూరు నగరంలో మూడింటికి ఎన్‌వోసీ లేనట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వాటికి కోర్టు ద్వారా అపరాధ రుసుం విధించినా... ఇప్పటికీ ఎన్‌వోసీ తీసుకోలేదని సమాచారం. ఏడాది కిందట నగరంలోని చిన్నబజారులో జరిగిన గోదాము ప్రమాదంతో మేలుకొన్న అగ్నిమాపకశాఖ అధికారులు జిల్లాలో ఏయే వాణిజ్య సముదాయాలకు అనుమతులు ఉన్నాయో ఆరా తీశారు. ఆ క్రమంలోనే ప్రైవేటు ఆసుపత్రుల విషయం బయటపడింది. నోటీసులు జారీ చేశారు. తాజా పరిస్థితుల్లో ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

  • జిల్లాలోని కొవిడ్‌ కేంద్రాలు, క్వారంటైన్‌ కేంద్రాల జాబితాను అధికారులు.. అగ్నిమాపకశాఖ అధికారులకు చేరవేశారు. వాటన్నిటిలో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేవా? అన్న అంశంపై నివేదిక కోరారు. దాంతో అన్ని కేంద్రాల పరిశీలనకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ప్రతి కేంద్రాన్ని క్షుణ్నంగా పరిశీలించనున్నారు.’
  • ఇటీవల అధికారులు జిల్లాలో 29 ఆసుపత్రులను కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌గా గుర్తించగా- ఒక్క నెల్లూరు నగరంలోనే 19 ఉన్నాయి. వీటిల్లో 15 అగ్నిమాపక పరికరాలు ఉండగా- మిగిలిన నాలుగింటిలో ఉన్నాయో? లేదో? తెలియదు. అధికారులు పరిశీలనలో ఉన్నారు.
  • కావలిలో 4, నాయుడుపేటలో 1 ఆసుపత్రి ఉండగా- వాటిలోనూ అగ్నిమాపక పరికరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్ని కేంద్రాలకు ఉన్నాయి? ఎన్నిటికి లేవో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఎన్‌వోసీ ఉందా? లేదా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.

భద్రత అరకొర

కరోనా బాధితులను వైద్యులు మూడు రకాలుగా గుర్తించి వైద్య సేవలందిస్తున్నారు. 50 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కొవిడ్‌ ఆసుపత్రిలో, తక్కువ వయసుండి లక్షణాలు లేకుండా పాజిటివ్‌ ఉన్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంటి వద్ద ప్రత్యేక గది, మరుగుదొడ్డి వసతి ఉన్న వారిని హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేసి సేవలందిస్తున్నారు. జిల్లాలో గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి డివిజన్‌ కేంద్రాలతో పాటు నెల్లూరు నగరం తదితర చోట్ల 11 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కేర్‌ సెంటర్‌లో వంద నుంచి 500 మంది బాధితులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. కేసులు సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వ ఆదేశాలు మేరకు రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీటిని ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో ప్రైవేటు ఆసుపత్రులు అద్దెకు తీసుకుని, మిగిలిన చోట్ల ఎన్టీఆర్‌ గృహకల్ప పథకం ద్వారా టిడ్కో నిర్మించిన అసంపూర్తి భవనాల్లో ఏర్పాటు చేశారు.

‘టిడ్కో’ భవనాల్లో సమస్య తిష్ఠ

నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, కావలి పట్టణాల్లో కేర్‌ సెంటర్లను అసంపూర్తిగా ఉన్న టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో విద్యుత్తు, తాగునీరు, శానిటేషన్‌ పనులన్నీ చివరి దశలో ఎక్కడికక్కడ నిలిపివేశారు. భవనాలు పక్కాగా ఉన్నా.. వాటిల్లో పూర్తి స్థాయిలో వసతులు లేవు. నాలుగు అంతస్తులున్న ఈ భవనాల్లో బాధితులను ఉంచేముందు భద్రత ప్రమాణాలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. అగ్నిమాపకశాఖ అధికారులు, సేఫ్టీ అధికారులు భవనాలు పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. వారిని తక్షణమే కిందికి దించే వసతి ఉండాలి. సహాయక చర్యల అనుకూలతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో భవనాలకు నామమాత్రంగా విద్యుత్తు, తాగునీటి పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి తమను ఇక్కడ ఉంచారన్న ఆవేదన బాధితులు, వారి కుటుంబీకుల్లో వ్యక్తమవుతోంది.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

ప్రతి ఆసుపత్రికి ఎన్‌వోసీ తప్పనిసరి. దానికి అనుగుణంగా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. ప్రమాదం జరిగితే తక్షణం మంటలను ఆర్పే ఏర్పాట్లు ఉండాలి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఏయే ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయో? లేవో? నివేదిక అందజేస్తాం. చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తాం. వాటితో పాటు మా శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అవీ తీసుకుంటాం. - శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి

ఇదీ చదవండి: ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థకు మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.