Couple suicide attempt: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. లింగసముద్రం మండలం చినపవని గ్రామంలో దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో భార్య షాహీన పరిస్థితి నిలకడగా ఉండగా.. భర్త షాహుల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తమ ఆత్మహత్యాయత్నానికి కారణం షాహుల్ స్నేహితుడు ఇలియాజ్ అని దంపతులు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన భర్త షాహుల్‌ను ఇలియాజ్ మద్యానికి బానిస చేశాడని.. షాహీన వాపోయింది. అనంతరం తన భర్త మద్యం మత్తులో ఉన్నప్పుడు తనకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. తనపై పలుమార్లు అత్యచారం చేస్తూ వీడియోలు తీశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆ వీడియోలు చూపి తమను బెదిరిస్తున్నాడని దంపతులు వాపోయారు. ఎవరికీ చెప్పుకోలేక.. పురుగుల మందు తాగుతున్నామని సెల్పీ వీడియోలో పేర్కొన్నారు. తమ చావుకు ఇలియాజే కారణమని వారు వాపోయారు.
ఇదీ చదవండి: