Corona kalakalam in SHAR: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో కరోనా కలకలం సృష్టించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పని చేస్తున్న 12మంది ఉద్యోగులకు కొవిడ్ వైరస్ సోకింది. షార్ కేంద్రం నుంచి బయటకు వెళ్లి వచ్చే వారికి చేసిన పరీక్షల్లో 12మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొవిడ్ సోకినవారి నుంచి ఒమిక్రాన్ పరీక్షలు చేసేందుకు శాంపిల్స్ తీసుకున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో కరోనా సోకడం గందరగోళానికి గురి చేస్తోంది.
ఇదీ చదవండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు