నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం బాలాజీ గార్డెన్ వాసి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆయనను నెల్లూరుకు తరలించారు. ఇటీవల దిల్లీ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొని వచ్చిన వారిలో ఈ వ్యక్తి కూడా ఉండటంతో వైరస్ సోకినట్లుగా నిర్థరించారు. ఈయనను నెల్లూరు క్వారంటైన్లో ఉంచారు. ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. వారితో కలసి తిరిగి జ్వరం వచ్చిన వారిని కూడా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడి: నెల్లూరులోని పలు డివిజన్లలో రెడ్ జోన్