బారా షహీద్ దర్గాలో సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రార్థనకు కొద్దిమంది మత పెద్దలతో నిర్వహించేందుకు అధికారులు అనుమతిచ్చారు. నేటి నుంచి మూడో తేదీ వరకు రొట్టెల పండగ జరగాల్సి ఉంది. సాయంత్రం దర్గా ఆవరణలో మూజావర్ల ప్రత్యేక ప్రార్థనలతో పండగ ప్రారంభమౌతుంది. సోమవారం రాత్రి గంధ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు కేవలం 20 మందినే అనుమతిస్తున్నారు. స్వర్ణాల చెరువులో ఇచ్చిపుచ్చుకునే కోర్కెల రొట్టెలను ఈసారి పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే దర్గా ప్రాంగణాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నిషేధిస్తున్నారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి