నెల్లూరు జిల్లాలో ఈ రోజు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు నివేదిక ఇచ్చారు. ఈ కేసులు తమిళనాడు కోయంబేడుతో సంబంధం ఉన్నవిగా గుర్తించారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం 111 కేసులు నమోదయ్యాయి. 76 మంది డిశ్చార్జి అయ్యారు. 32 మందికి జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మృతి చెందారు. 6,900 మంది వద్ద నమూనాలు సేకరించగా... ఇప్పటి వరకు 4112 ఫలితాలు వచ్చాయి.
నెల్లూరు జిల్లాలో కేసులు సంఖ్య తగ్గుతోంది. డిశ్చార్జి సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు ఆశాజనకంగా ఉన్న సమయంలో... కోయంబేడు మార్కెట్ లింకులతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కలెక్టర్ శేషగిరిబాబు సూళ్లూరుపేటపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. పట్టణం అంతా రెడ్ జోన్ గా ప్రకటించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు.
దుకాణాలను మూసివేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్న వ్యాపారులను, ఆటో డ్రైవర్లను 250మంది వరకు గుర్తించారు. వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.
ఇదీ చదవండి: