ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటపై అమ్మాయి తరుపు బందువులు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. సాయి, శ్రావణ్.. కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పదిరోజుల క్రితమే జొన్నవాడలో ప్రేమ పెళ్లి చేసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. వాళ్ల ప్రేమ పెళ్లిని అంగీకరించని అమ్మాయి బంధువులు.. ఆలయం వద్ద కొత్తజంటను నిర్భంధించి దాడి చేశారు. ఇంటికి వచ్చేయమని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినా.. నేను రానని ఆ అమ్మాయి తెగేసి చెప్పడం గొడవకు దారి తీసింది. ఈ సందర్బంగా ఇరువ వర్గాల వారి గొడవతో ఆలయం వద్ద గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సర్ది చెప్పడంతో అమ్మాయి తరఫు బంధువులు శాంతించారు.
ఇదీ చదవండి..