ETV Bharat / state

నెల్లూరులో ఉద్రిక్తత...మైనార్టీ నాయకులు, అధికారుల మధ్య వాగ్వాదం - నెల్లూరు తాజా వార్తలు

నెల్లూరులో మాగుంట లేఅవుట్ వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న సైన్స్ సెంటర్ పై వివాదం నెలకొంది. ఆ స్థలం తమ బోర్డు ఆస్తి అంటూ కొందరు మైనార్టీ నాయకులు పనులను అడ్డుకున్నారు.

ఆందోళన చేస్తున్న మైనార్టీ నాయకులు
ఆందోళన చేస్తున్న మైనార్టీ నాయకులు
author img

By

Published : Jul 12, 2021, 8:08 PM IST

నెల్లూరులో మాగుంట లే అవుట్ వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న సైన్స్ సెంటర్ పై వివాదం నెలకొంది. ఆ స్థలం వక్ఫ్ బోర్డు ఆస్తి అంటూ కొంతమంది మైనార్టీ నాయకులు పనులను అడ్డుకున్నారు. కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకోవడంతో మైనార్టీ నాయకులు, కార్పొరేషన్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కబ్జా చేస్తారా అంటూ మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు.

కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు పెద్దల కనుసన్నల్లో బోర్డ్ ఆస్తులను మాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ఆస్తులను పరిరక్షించుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మైనార్టీ నేతలు పేర్కొన్నారు. చివరికి.. వక్ఫ్ బోర్డ్ స్థలమని ఏమైనా కాగితాలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని.. లేదంటే న్యాయస్థానాలకు వెళ్లాలి అంటూ కార్పొరేషన్ అధికారులు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

water disputes: 'రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతులకు న్యాయం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.